Letter to Son
O light of
my eyes!
ఓ నా కంటివెలుగా!
I don't know
how to start.
I’m so
confused that I don’t know how to tell you.
ఏ విధముగా చెప్పాలో అర్థం కానీ సంశయ స్థితి.
Because we
have discussed many things since childhood.
ఎందుకంటే చిన్నప్పటినుండి ఎన్నో విషయాలు చర్చించుకున్నాం.
We talked
from Ambedkar to Abdul Kalam.
అంబెడ్కర్ గారి దగ్గర నుండి అబ్దుల్ కలాం గారి వరకు మాట్లాడుకున్నాం.
We started
from the Ramayana and went up to the atomic bomb.
రామాయణం దగ్గర మొదలు పెట్టి అణుబాంబు వరకు చెప్పుకున్నాం.
We have
learned how the intellectual property of our country has been transferred.
మన దేశములోని మేధా సంపత్తి ఏ విధముగా తరలిపోయిందో తెలుసుకున్నాం.
What will
the society be like if they manage someone's virtue..how will the society be if
they don't manage it. We have talked about that in detail.
ఎవరి దర్మం వాళ్లు నిర్వహిస్తే సమాజం ఎలా ఉంటుంది..నిర్వహించకపోతే సమాజం ఎలా ఉంటుంది. అన్ని విపులముగా చెప్పుకున్నాము.
But you forgot
everything and are behaving carelessly.
అయినా అన్నిటిని మరిచి నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నావు.
That means
you are going aside saying lite.
అదేమంటే లైట్ అంటూ సైడ్ కి వెళ్తున్నావు.
All these
years I felt like I know everything about you..
ఇన్నాళ్లు నా కంటివెలుగుకు అన్ని తెలుసు అనుకుంటూ నేను భావిస్తున్నాను.
I realized
then that even though my light was my image, my eyes were fading in the
blindness.
నాకిప్పుడు అర్థమయింది..నా వెలుగైనా ..నా ప్రతిరూపం గుడ్డితనంలో కూరుకుపోయిందని..కళ్ళు మసకబారుతున్నాయి.
నాకు అర్థమైంది ఒక్కటే నువెవరినో చూసి ప్రభావితం అవుతున్నావు. ఈ ప్రభావితం వల్ల నీ ప్రభ కోల్పోతున్నావు.
Once there
was a joint family. Even if I scolded as a father, the adults would say it in a
language that the children could understand.
ఒకప్పుడైతే జాయింట్ ఫామిలీ ఉండేది. తండ్రిగా నేను తిట్టినా పెద్దవాళ్ళు..పిల్లలకు అర్ధమయ్యే భాషలో చెప్పేవారు.
But now
there is no joint family...Either Mother or father should make the children
understand the situation.
కానీ ఇప్పుడు జాయింట్ ఫామిలీ లేదు. తల్లో..తండ్రో ఎవరో ఒకరు చెప్పాల్సిన పరిస్థితి.
Because of
that, the children are less afraid of their parents and are more friendly.
దాని వల్ల పిల్లలకి తల్లితండ్రులంటే భయం పోయి ఫ్రెండ్లీ గా ఉంటున్నారు.
This pampering
made the children undisciplined.
ఈ గారాబం పిల్లలకు క్రమశిక్షణ లేకుండా చేసింది.
Mainly
negligence..intolerance are weeds in man… Make the man unnoticed..
ముఖ్యముగా నిర్లక్ష్యం..అసహనం యివి మనిషిలోని కలుపుమొక్కలు...మనిషి చిరునామాను నామరూపాలు లేకుండా చేస్తాయి.
Our studies should give us knowledge as well as humility…Then only there will be progress.అరేయ్ మన చదువుకున్న చదువులు మనకి విజ్ఞానంతో పాటు వినయవిధేయతలు కూడా అందించాలి.
Humbleness
is not shame.
అప్పుడే పురోగతి ఉంటుంది....వినయమన్నదేమి అవమానం కాదు.
It is the
respect we give to others...this respect lifts us to the sky.
మనం ఎదుటవారికి మనమిచ్చే గౌరవం... మనల్ని ఆకాశములో కూచోబెడుతుంది.
in Ramayan ..Lord
Hanuman who crossed the ocean and reached lanka found out where ravan hid sita,
but he humbly said that it was possible only because of Rama's mercy.
రామాయణములోని హనుమాన్ స్వామివారిని చూడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతమ్మ వారి జాడ తెలుసుకున్నా అది రాముల వారి దయ వల్లే ఇది సాధ్యమైదంటూ వినయముగా చెపుతాడు.
He is Very
Strong. But too, he humbly bows before Rama with folded hands.
బలవంతుడు కాదా! అంటే రాక్షసులనే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అయినా వినయముతో చేతులు కట్టుకుని రాముల వారి ముందు కూచుంటాడు.
Because of this, the moral that we need to know is..we should know how grown up we are.
దీని వల్ల మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే..మనమెంత ఎదిగిన ఒదిగి ఉండాలని..ఒదిగి ఉండటం వల్ల మన కీర్తిప్రతిష్టలు మరింత ప్రకాశిస్తాయని తెలుసుకోవాలి.
Whether you
believe it or not, the respect of parents, the future of the country depends on
the behavior of the sons and daughters.
నువ్వు నమ్ముతావో..నమ్మవో పుత్రుల..పుత్రికల ప్రవర్తన మీదే తల్లితండ్రుల గౌరవాభిమానాలు..దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి.
Yesterday..
my father, Present time… I, Tomorrow.. you, next day… your son, this wheel will
continue to spin.
నిన్న మా నాన్న, ఈవేళ నేను, రేపు నువ్వు, ఎల్లుండి నీ కొడుకు యిల ఈ చక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది.
Time stops for no one. We must shine when our time comes... We must be the best guide to the next generations.
సమయం ఎవరి కోసం ఆగదు. మన సమయం వచ్చినప్పుడు మనం వెలగాలి...ముందు తరాలకు మనం మార్గదర్శకం కావాలి.
Every man
has to play many roles in his life.
ఏ మనిషైనా నిజజీవితానికి వచ్చేసరికి ఎన్నో రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది.
I have been playing role as a father..teacher..brother..boss…friend and I will continue play them.
నేన్నీకు తండ్రిగా..గురువుగా...అన్నగా..తమ్ముడుగా..బాస్ గా ...ఫ్రెండ్ ..ఇత్యాది పాత్రలను తెలియకుండానే పోషిస్తున్నాను… పోషిస్తునే ఉంటాను.
Because it is my responsibility to supervise you!
That's why I
am acting in various roles to tell your destination.
అందుకే నేను రకరకాల పాత్రలలో అభినయిస్తూ..నీ గమ్యాన్ని తెలియచేస్తున్నాను.
After me,
you should supervise your children.
నా తర్వాత నువ్వు కూడా నీ పిల్లల దగ్గర అభినయిస్తూ..పర్యవేక్షించాలి.
There are
many attractions for your age.
నీ వయసుకు ఎన్నో ఆకర్షణలు..ఆకర్షిస్తుంటాయి.
In the
Ramayana, Sita fell in love with a golden deer and ended her life in misery.
రామాయణంలో బంగారు జింక ఆకర్షణలో పడిన సీత తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంది.
you know
everything...but, out of ten people...if one acts like a lunatic because of
one's zeal, The team will be chaotic.
నీకు తెలియదా అంటే అన్ని తెలుసు...కానీ, పదిమందిలో..ఒక్కరి అత్యుత్సహం వల్ల మరొకరు ఉన్మాదిగా ప్రవర్తిస్తే అందరూ బలవుతారు.
I’m telling
because you shouldn’t make any mistake..
ఇవన్నీ ఎందుకంటే..నువ్వు తప్పటడుగు వేయకుండా జాగ్రత్త పడతావని...
If it comes
to study..you think that pass marks are great but in future when companies hire
they will your grades and behavior.
నెక్స్ట్ చదువు విషయానికొస్తే పాస్ అయితే చాలనుకుంటున్నావు. ఆలోచించు..రేపు పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి..అవి మార్కులు చూస్తాయి..ప్రవర్తన చూస్తాయి.
It hurts that
they didn’t choose you and its useless.
అప్పుడు భాధ పడితే లాభమేముంది. చేతులు కాలాక ఆకులూ పట్టుకున్నట్లుంటుంది.
Without
education there is no life. I feel like..there is no meaning in life.
చదువు లేకపోతె జీవితం లేదా అంటే ఉంటుంది. నాకు లాగ ఉంటుంది..జీవితములో ఓ సారం ఉండదు.
A
certificate from a reputed university is not the only…you should do work and research.
ప్రముఖ యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ ఒక్కటే కాదు.
దానికి తగ్గ పరిశ్రమ ఉండాలి...పరిశోధన ఉండాలి.
Only then you
will gain confidence in yourself..
అప్పుడే నీపై నీకు విశ్వాసం పెరుగుతుంది.
Only then
can you do good for other people.
అప్పుడే పదిమందికి మేలు చేయగలవు.
In your
language life will be lite.
ఇంకా నీకు అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే చాల lite గా ఉంటుంది.
My point is
to show how a system can go damage when communication is not right.
కమ్యూనికేషన్ అన్నది సరిగా లేకపోతె సిస్టం ఎలా అస్తవ్యస్తం అవుతుందో చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.
Life
is not about wearing brands..we have to become a brand.
జీవితమంటే బ్రాండ్స్ ధరించడమే కాదు..మనమే ఓ బ్రాండ్ గా మారాలి.
Life is not lite..Life is light...it's up to you whether you stay lite or shine light.
Comments
Post a Comment